![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -990 లో.. భద్రని ముకుల్ కి అప్పగించిందని, వాడెక్కడ నిజం చెప్తాడోనని శైలేంద్ర టెన్షన్ పడుతుంటాడు. అప్పుడే ధరణి నిద్ర లేచి.. ఏంటి ఇంకా పడుకోలేదు.. ఎందుకు టెన్షన్ పడుతున్నారంటు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంటే శైలెంద్రకి చిరాకు వస్తుంది. నాకు బయట టెన్షన్ కన్న నీ టెన్షన్ ఎక్కువ అయిందని శైలేంద్ర తన మనసులో అనుకుంటాడు.
ఆ తర్వాత ఈ వసుధార ఇందాక ఇక్కడే ఉండేది కదా.. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది కనీసం ఒక్కమాట కూడా చెప్పకుండా వెళ్తుందని అనుపమతో మహేంద్ర అంటుండగా.. అప్పుడే వసుధార వస్తుంది. ఎక్కడికి వెళ్ళావని మహేంద్ర అడుగుతాడు. భద్ర గురించి వసుధార చెప్తుంది. నేను ఫస్ట్ నుండి చెప్తున్నా నా మాట ఎవరు విన్లేదు.. వాడు శైలేంద్ర మనిషి అని వసుధార చెప్తుంటే.. నువ్వు చెప్పేది నిజామా అని ఇద్దరు ఆశ్చర్యపోతారు. వాడి నిజస్వరూపం బయటపెట్టాలని కావాలనీ రిషి సర్ దొరికినట్లు ఫోన్ లో మాట్లాడుతు వెళ్ళాను వాడు అది విని శైలేంద్రకి చెప్పాడు. ఆ తర్వాత వాడు నన్ను ఫాలో అవుతు వచ్చాడు. ముకుల్ కి అప్పగించాను. కాసేపటి తర్వాత శైలేంద్ర కూడా వచ్చాడు.. వాడికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి పంపించానని వసుధార చెప్తుంది. ఇంట్రాగేషన్ లో రిషి సర్ గురించి కూడా తెలుస్తుందని వసుధార చెప్తుంది. ఆ తర్వాత భద్రని ముకుల్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. నీతో ఇలా చెయ్యమని చెప్పింది శైలేంద్ర కదా చెప్పమని ముకుల్ అడుగుతాడు. నీకు శైలేంద్ర ఎంత ఇస్తాను అన్నాడో అంత ఇస్తాను నిజం ఒప్పుకోమని ముకుల్ చెప్తాడు.. నాకు ఒక పూట టైమ్ కావాలి.. ఆలోచించుకోవాలని భద్ర అంటాడు. సరే రేపు ఉదయం వస్తానని ముకుల్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అక్కడే ఉన్న కానిస్టేబుల్ తో భద్ర డీల్ మాట్లాడతాడు. నన్ను విడిపించు ఎంత కావాలన్నా ఇస్తాను ఇస్తానని శైలేంద్ర మెసేజ్ చేస్తాడు.
మరుసటి రోజు ఉదయం ముకుల్ మహేంద్ర ఇంటికి వస్తాడు. భద్ర ఏమైనా రిషి గురించి చెప్పాడా అని అడుగుతారు. వీడియో డిలీట్ చేసింది వాడే అని ముకుల్ చెప్తాడు. ఆ తర్వాత భద్ర కస్టడి నుండి తప్పించుకున్నాడని ముకుల్ చెప్పగానే.. అందరు షాక్ అవుతారు. కాసేపటికి శైలేంద్రకి ఎవరో ఫోన్ చేసి.. భద్ర తప్పించుకున్నాడని చెప్పగానే హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ విషయం శైలేంద్ర దేవయానికి చెప్తాడు. ఇప్పుడు తప్పించుకున్నాడు కానీ తర్వాత దొరికితే అని దేవయాని అనగానే.. మన గురించి తెలియదు.. భద్ర చెప్పడు.. అసలు ఉంటేనే కదా అని శైలేంద్ర అనగానే.. దేవయాని షాక్ అవుతుంది. వాళ్ళ మాటలన్నీ ధరణి వింటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |